ఆకాశంలో అంజలి బర్త్ డే సెలెబ్రేషన్స్.

Published on Jun 21, 2019 9:15 am IST

హీరోయిన్ అంజలి ఈ మధ్య “లిసా”అనే హారర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టారు . ఆమె తెలుగు తమిళ భాషలలో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అంజలి ఆనందభైరవి, గీతాంజలి-2, సైలెన్స్ మోవీలతో పాటు మరో రెండు మూడు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా జూన్16న తన పుట్టినరోజును విభిన్నంగా జరుపుకొని మరోసారి వార్తలో నిలిచారు అంజలి.

అనుష్క,మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న”సైలెన్స్” మూవీలో అంజలి ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు . ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన అంజలి తన పుట్టిన రోజున స్కై డైవింగ్ చేసి సాహసోపేతంగా జరుపుకున్నారు. మగాళ్లు సైతం భయపడే ఈ సహస క్రీడలో అంజలి పాల్గొనడంతో ఆమె ధైర్యానికి అందరు ఆశ్చర్యపోతున్నారు. కొంచెం ఆలస్యంగా ఈ విషయాన్నీ స్వయంగా అంజలి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

More