సిస్టర్ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ కొట్టేసిన అంజలి

సిస్టర్ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ కొట్టేసిన అంజలి

Published on Sep 1, 2015 1:12 PM IST

anjali-and-sister
‘షాపింగ్ మాల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగువారి మదిలో నిలిచిపోయిన హీరోయిన్ అంజలి. అంజలి హీరోయిన్ గా పలు తెలుగు, తమిళ సినిమాలలో బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో పలు సినిమాల్లో అతిధి పాత్రల్లో కనిపిస్తూ తన కెరీర్లో బిజీ బిజీగా ఉంది. ఇప్పుడు అంజలి ఫ్యామిలీ నుంచి తన కజిన్ సిస్టర్ అయిన ఆరాధ్య తెలుగు చిత్ర సీమలో హీరోయిన్ గా పరిచయం కానుందని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో మహానంది, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, పంచాక్షరి లాంటి హిట్ సినిమాలను అందించిన సముద్ర దర్శకత్వంలో ఆరాధ్య నటించనుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై అంజలి స్పందించింది. ‘మా సిస్టర్ ఆరాధ్య ఏ సినిమాతోనూ హీరోయిన్ గా పరిచయం కావడం లేదు. తను ప్రస్తుతం గర్భంతో ఉంది. మరో నెలలో ఓ పండంటి బిడ్డకి జన్మనివ్వనుందని’ అంజలి తెలిపింది. దీంతో ఈ వార్తలకి తెరపడింది. మరి ఎవరు సముద్ర చేయనున్న ఈ సినిమాలో నటించనున్నారు అనే విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు