
నందమూరి బాలకృష్ణ నటించనున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. ఇటీవలే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్ గా నటించనున్న సంగతి ఇది వరకే తెలియజేశాం. అంజలి ఈ సినిమా కోసం తన లుక్ ని పూర్తిగా మార్చుకోనుంది. అందుకే కాస్త స్లిమ్ అవ్వడమే కాకుండా ఈ సినిమాలో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించనుందని ఈ చిత్ర టీం తెలియజేసింది. ప్రస్తుతమం అంజలి తన స్టైలిష్ లుక్స్ అండ్ కాస్ట్యూమ్స్ పై వర్కౌట్ చేస్తోంది.
కేవలం అంజలినే కాకుండా బాలకృష్ణ కూడా ఈ సినిమా కోసం కాస్త స్లిమ్ అవ్వడమే కాకుండా, సరికొత్త లుక్ లో కూడా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టైలిస్ట్స్ బాలకృష్ణ న్యూ లుక్ ని డిజైన్ చేసారు. ప్రస్తుతం బాలయ్య వెయిట్ తగ్గే పనిలో ఉన్నాడు. లక్ష్యం, లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతే కాకుండా ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి తన హోం బ్యానర్లో ఈ సినిమా చేస్తున్నాడు. టాప్ రైటర్స్ అయిన కోన వెంకట్ – గోపి మోహన్ – రత్నం – శ్రీధర్ సీపాన కలిసి కథ సిద్దం చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ఎస్ తమన్ ని ఎంపిక చేసారు.

