
‘రౌడీ’, అనుక్షణం, డైనమైట్ లాంటి విభిన్న తరహా సినిమాలు చేసి మెప్పించిన మంచు విష్ణు ఇప్పుడు ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ‘సరదా’. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ‘జాదూగాడు’ ఫేమ్ సోనారిక బడోరియా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సొనారికకి కాకుండా ఓ ముఖ్య పాత్ర కోసం మరో స్టార్ హీరోయిన్ కి కూడా పరిశీలిస్తున్నారని ఇది వరకే తెలియజేశాం.
ఇటీవలే ఈ చిత్ర టీం ఆ పాత్ర కోసం మలయాళ బ్యూటీ అమలా పాల్ ని అనుకున్నారు. కానీ అమలా పాల్ ఓకే అవ్వలేదు. దాంతో ఫైనల్ గా ఈ చిత్ర టీం తెలుగమ్మాయి అంజలి అయితే బాగుంటుందని ఆ పాత్ర కోసం సెలక్ట్ చేసుకొని ఆమెని అప్రోచ్ అయ్యారు. అంజలి కూడా తన పాత్ర విని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్, పృథ్వీ, వెన్నెలకిషోర్, శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ పై డి.కుమార్, పల్లి కేశవరావు నిర్మాతలుగా రూపొందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

