ఇంటర్వ్యూ : అంజలి – లవ్ లో ఉన్నానని ఎప్పుడు చెప్పాను, బ్రేక్ అప్ అవ్వడానికి.

Published on May 20, 2019 5:08 pm IST

ప్రముఖ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ లిసా. తెలుగు, తమిళ భాషల్లో త్రీడి టెక్నాలజీతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం ఈనెల 24న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అంజలి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

 

ముందుగా అసలు ‘లిసా’ గురించి చెప్పండి ?

‘లిసా’ రెగ్యులర్ హారర్ ఫిల్మ్ లా ఉండదు. చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా ‘లిసా’ని మేం త్రీడి టెక్నాలజీతో షూట్ చేయడం జరిగింది. రేపు థియేటర్ లో ఆడియన్స్ కు త్రీడిలో ‘లిసా’ కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది.

 

మీరు 2డిలో సినిమాలు చేశారు. ఇప్పుడు 3డిలో కూడా చేశారు. ప్రధానంగా 2డి- 3డి రెండిటి మధ్య మీరు గమనించిన తేడా ఏమిటి ?

చాలా తేడా ఉందండి. 2డికి ఎక్కువుగా నటీనటుల నటనకు, వారి ఎమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం. కానీ 3డి లో కెమెరాకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి షాట్ ను ఎంతో కష్టపడి చెయ్యాలి, పైగా చాలా టైం కూడా పడుతుంది. ప్రతి షాట్ బెస్ట్ షాట్ ఇవ్వాలి. అప్పుడే 3డి వర్కౌట్ అవుతుంది. 2డి అంత కష్ట పడాల్సిన అవసరం లేదు.

 

అంటే 3డిలో తీస్తున్నందుకే ‘లిసా’ని మీరు అంగీకరించారా ?

లేదు. నాకు కథ చెప్పినప్పుడు.. ఈ సినిమా 3డిలో తీస్తున్నారని చెప్పలేదు. అయినా నాకు ఫస్ట్ కథ నచ్చితేనే ముందుకు మూవ్ అవుతాను. పర్సనల్ గా నాకైతే ‘లిసా’ కథ చాలా బాగా నచ్చింది. రేపు ప్రేక్షకులను కూడా కథ బాగా ఆకట్టుకుంటుంది.

 

‘లిసా’లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ?

లిసాలో టైటిల్ రోల్ ప్లే చేశాను. సినిమాకి ‘లిసా’ అని టైటిల్ పెట్టడానికి కూడా బలమైన కారణం ఉంది. అలాగే సినిమాలో నా క్యారెక్టర్ సంబంధించిన పార్ట్ చాలా ఇంట్రస్టింగ్ గా సాగుతుంది.

 

ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఎక్కువుగా కనిపించట్లేదు ?

నేను తమిళ్, తెలుగు రెండు భాషల్లో సినిమాలు చేస్తున్నాను. సహజంగానే రెండు చోట్ల సినిమాలు చేస్తున్నపుడు డేట్లు సమస్య వస్తోంది అండి. కరెక్ట్ గా తమిళ్ ఫిల్మ్ జరుగుతున్న సమయంలోనే తెలుగులో డేట్లు అడుగుతున్నారు. అలాగే తెలుగులో చేస్తున్నప్పుడే తమిళంలోనూ డేట్లు ఎడ్జెస్ట్ చెయ్యాల్సి వస్తోంది. సో.. అందుకే రెండు భాషల్లో వరుసగా సినిమాలు చేయలేకపోతున్నాను. గ్యాప్ అయితే కావాలని తీసుకుటుంది కాదు.

 

హారర్ ఫిల్మ్ లో యాక్ట్ చేశారు. భయం అనిపించలేదా ?

కొన్ని సార్లు హారర్ ఫిల్మ్స్ చూస్తూ భయపడిన సందర్భాలు ఉన్నాయి (నవ్వుతూ). కానీ, లిసా చూసి మాత్రం భయపడలేదు. ఎందుకంటే సినిమా చేసింది నేనే కదా. కథ ఏంటో నాకు తెలుసు, తరువాత జరగబోయే సన్నివేశాల క్రమం తెలుసు, ఇంక భయపడాల్సిన అవసరం ఏముంది.

 

మీరు నిర్మాతగా మారుతున్నారని ఆ మధ్య రూమర్స్ వచ్చాయి ?

లేదండి (నవ్వుతూ) నేనెప్పుడూ నిర్మాణం గురించి ఆలోచించలేదు. అలోచించాలనే ఆలోచన కూడా లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా నటన పైనే ఉంది.

 

మీరు లవ్ బ్రేక్ అప్ అయిందని సోషల్ మీడియాలో ఇప్పటికే చాలాసార్లు వార్తలు వచ్చాయి ?

అసలు నేను (నవ్వుతూ) లవ్ లో ఉన్నానని ఎప్పుడు చెప్పాను, బ్రేక్ అప్ అవ్వడానికి. అవ్వన్నీ రూమర్స్ అండి. ముందే చెప్పను కదా, ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలు పైనే.

 

మరి మీరు గతంలో ఓ తమిళ్ యంగ్ హీరోతో చనువుగా ఉన్నారు కదా. అతనితో దిగిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో ఆ మధ్య ఎక్కువుగా పోస్ట్ చేశారు ?

ఫొటోస్ పోస్ట్ చేస్తే.. లవ్ చేసినట్లా.. ? చాలామంది ఫ్రెండ్స్ తో ఫొటోస్ దిగుతాం, సరదాగా పోస్ట్ చేస్తాం. అంతమాత్రాన లవ్ అంటే ఎలా.

 

తెలుగులో ప్రస్తుతం సినిమాలు ఏమైనా చేస్తున్నారా ?

చేస్తున్నానండి. సైలెంట్ సినిమా చేస్తున్నానుగా. ఆ తరువాత గీతాంజలి 2 ఉంటుంది. నాక్కూడా తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలని ఉంది.

సంబంధిత సమాచారం :

More