ఏపీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి హైక్స్.. ఎర్లీ షోస్, టికెట్ ధరల డీటెయిల్స్ ఇవే!

ఏపీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి హైక్స్.. ఎర్లీ షోస్, టికెట్ ధరల డీటెయిల్స్ ఇవే!

Published on Mar 13, 2026 11:58 PM IST

ustaad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్స్ శ్రీలీల, రాశి ఖన్నా పవన్ సరసన నటిస్తుండగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉగాది కానుకగా వస్తున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

ఇక ఈ సినిమాకి ఏపీలో టికెట్ ధరలు అలాగే షోస్ ఎలా ఉంటాయి అనేది డిసైడ్ అయినట్టు టాక్ వచ్చింది. ఇప్పుడు అది అఫీషియల్ గా జీవో తో ఖరారు అయ్యింది. ఏపీలో మార్చ్ 19 తెల్లవారుజాము 4 గంటల నుంచే ఏపీలో షోస్ మొదలు కానున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఆ షోస్ కి గాను 500 రూపాయల టికెట్ ధరను డిసైడ్ చేశారు.

ఇక మిగతా షోస్ కి సింగిల్ స్క్రీన్ అయితే అదనంగా 100 రూపాయలు, మల్టిప్లెక్స్ అయితే 125గా డిసైడ్ చేశారు. అలాగే ప్రతీ రోజు 5 షోస్ వేసుకునేలా 10 రోజులు వరకు జీవో ద్వారా తెలిపారు. సో ఇక బుకింగ్స్ ఒక్కటి మొదలు కావడమే బాకీ ఉంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్, థమన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

USB 3

సంబంధిత సమాచారం

తాజా వార్తలు