సాలిడ్ బ్రేక్ కోరుకుంటున్న అంజలి !

Published on May 20, 2019 12:00 am IST

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో వెంకటేష్ సరసన సీతగా నటించి తెలుగమ్మాయి అయిపోయింది అంజలి. ఆ సినిమా తరవాత ఆమెకు ఆఫర్లు బాగానే వచ్చాయి. ఆమె చేసిన హర్రర్ ఫిల్మ్ ‘గీతాంజలి’ సైతం బాగానే ఆడింది. కానీ ఆ తర్వాత ఎదురైన ‘డిక్టేటర్, చిత్రాంగధ’ వంటి పరాజయాలతో కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ఒడిదుడుకులు కూడా ఆమెను సినిమాలకు కొంచెం దూరం చేశాయి.

వాటి నుండి త్వరగానే బయటపడిన అంజలి కెరీర్ మీద దృష్టి పెట్టి చేసిన చిత్రం ‘లిసా’. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ త్రీడీ హర్రర్ చిత్రం ఈ నెల తెలుగు, తమిళంలో 24న విడుదలకానుంది. ఈ చిత్రం సక్సెస్ అయితే తనకు టాలీవుడ్, కోలీవుడ్ రెండు చోట్ల అవకాశాలు పెరుగుతాయని అంజలి ఆశపడుతోంది. లుక్స్ పరంగా కూడా పూర్వం కంటే అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది అంజలి. మరి ఆమె కెరీర్‌ను ‘లిసా’ ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More