
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బలుపు’ సినిమాలతో తమ ఇంట్లో అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అంజలి. ఈ తెలుగమ్మాయి ఓ యంగ్ హీరో సినిమా కోసం ఓ గ్యాంగ్ ని మెయిన్టైన్ చేసే దొంగగా మారింది. ఇంతకీ ఎవరా హీరో.? ఏంటా సినిమా అనుకుంటున్నారా.? హ్యాట్రిక్ హిట్స్ అందుకొని మంచి జోష్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘శంకరాభరణం’. ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో నటించనుంది. అది కూడా ఓ దొంగల గ్యాంగ్ కి మెయిన్ లీడర్ గా కనిపించనుందని సమాచారం.
అంజలి ఇంకా తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ మొదలు పెట్టలేదు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూణేలో మొదలైంది. అక్కడ బాగా కష్టమైన లొకేషన్స్ లో షూటింగ్ చేసిన ఈ సినిమాని తడుపరిగా బీహార్, నార్త్ ఇండియాలోని కొన్ని చూడని మరియు టఫ్ లొకేషన్స్ లో షూట్ చేయనున్నారు. టాప్ రైటర్ కోన వెంకట్ ఈ సినిమాకి కథ – డైలాగ్స్ అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. నిఖిల్ సరసన నందిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ఉదయ్ నందనవనం డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

