ఇన్‌స్టాలో అడుగుపెట్టిన అన్నా కొణిదెల.. భార్యకు వెల్కమ్ చెప్పిన పవన్ కళ్యాణ్

pawan 1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. తన పేరును ‘అన్నా కొణిదెల’గా మార్చుకుంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా తన భార్యకు స్వాగతం పలుకుతూ ఒక పోస్ట్ చేశాడు. ‘డియర్ అన్నా కొణిదెల, ఇన్‌స్టాగ్రామ్‌లోకి నీకు సాదర స్వాగతం.. ఈ వేదిక ద్వారా నువ్వు అర్థవంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకుంటావని ఆశిస్తున్నాను’ అంటూ ఆయన విష్ చేశారు.

మరోవైపు, ఇన్‌స్టాగ్రామ్‌లో తన మొదటి పోస్ట్‌ను అన్నా లెజినోవా చాలా స్పెషల్‌గా షేర్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోను ఆమె పోస్ట్ చేస్తూ.. ‘ఇది ఎప్పుడో జరగాల్సింది, కానీ ఇప్పుడే సరైన సమయం అనిపిస్తోంది. చిరంజీవి గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడికి వచ్చాను’ అని ఆమె పేర్కొంది. ముఖ్యంగా తన బయోలో ‘రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్’ అని రాసుకోవడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట ఫోటో వైరల్ అవుతుంది. మెగా అభిమానులు అన్నా కొణిదెలకు ఘన స్వాగతం పలుకుతూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఇక మెగా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మరియు ఇతర హీరోలు అన్నా లెజినోవా సోషల్ మీడియా ఎంట్రీపై ఎలా స్పందిస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version