రజినీ “అన్నాతే” చిత్రం విడుదల తేదీ పై వచ్చిన క్లారిటీ!

Published on Jul 2, 2021 12:07 am IST


సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నాతే. అయితే ఈ చిత్రం విడుదల తేదీ పై ఒక క్లారిటీ వచ్చింది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం తో లాక్ డౌన్ కారణం గా చిత్ర షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మునుపటి ఇచ్చిన తేదీ తో తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. అందులో నవంబర్ నాల్గవ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పోస్టర్ చూసిన రజినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్ ఇచ్చిన మాట ను నిలబెట్టుకుంటూ సినిమా ను అనుకున్న తేదీకి విడుదల చేస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు.

అయితే రజినీ కాంత్ అన్నాతే చిత్రం కి సంబంధించిన తాజా పోస్టర్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ సూపర్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం లో రజినీకాంత్ సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, గోపి చంద్, ప్రకాష్ రాజ్, కీర్తీ సురేష్, మీనా లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పతాకంపై సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం డి. ఇమ్మన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :