రెండు తెలుగు రాష్ట్రాలకి పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ఊహించని విధంగా సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కి ఇటీవల ఓ మీటింగ్ సమయంలో జరిగిన అస్వస్థత నిమిత్తం ట్రీట్మెంట్ జరిగింది. దీనితో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మన టాలీవుడ్ సహా పొలిటికల్ లీడర్స్ కూడా తమ స్పందన తెలియజేసి పవన్ త్వరగా కోలుకోవాలని ఎన్నడూ లేని విధంగా స్పందించారు.
మన తెలుగు నుంచి అయితే ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రామ్ చరణ్ అలాగే ఇతర బిగ్ స్టార్స్ పోస్ట్ చేశారు. అయితే పవన్ ఆరోగ్యానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి అప్డేట్ అందించడం జరిగింది. పవన్ కి మెడికల్ ప్రొసీజర్ విజయవంతంగా జరిగింది.
ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగా ఉంది. కోలుకుంటున్నాడు. వైద్యులు ఒక వారం పాటు విశ్రాంతి సూచించారు. అప్పుడు మళ్ళీ సాధారణ స్థితికి తాను వస్తాడని తెలిపినట్టు చిరు తెలిపారు. అలాగే అలాగే తన తమ్ముడు ఆరోగ్యంపై ఇంతమంది చూపిస్తున్న ప్రేమకి, ఆప్యాయతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చిరంజీవి తెలిపి ముగించారు.
Kalyan Babu has successfully undergone a medical procedure and is now safe, stable, and recovering well.
As per the doctors, it may take about a week for him to return to his normal routine. There is no cause for concern.
Thank you all for your love, concern, and prayers. Let…
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 19, 2026
