కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయ థలపతి విజయ్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి బలమైన విలన్ పాత్రలో లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించిన సెన్సేషనల్ చిత్రం “మాస్టర్”. దక్షిణాదిలో మంచి మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచ్చి లేటెస్ట్ గా వచ్చిన టీజర్ ఎలాంటి స్థాయి రెస్పాన్స్ ను రాబట్టుకుందో తెలిసిందే. అయితే అప్పుడు టీజర్ తో దుమ్ములేపిన టీం..
ఈసారి ట్రైలర్ తో మరోమారు సెన్సేషన్ ను నమోదు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ట్రైలర్ ను మేకర్స్ రానున్న కొత్త సంవత్సరం బ్లాస్ట్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి బజ్ లా వినిపిస్తున్న ఈ అంశంపై అధికారిక క్లారిటీ కూస్తో రానున్నట్టు సమాచారం. మరి ఈ ట్రైలర్ వస్తే అది యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించాడు.


