తారక్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ అప్డేట్ కూడా ఉందట.!

Published on May 20, 2021 8:02 am IST

ఈరోజు మన టాలీవుడ్ మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొదటగా 123తెలుగు టీం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరి ఈ పవర్ ఫుల్ దినాన యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. అలాగే ఇదే రోజున తారక్ నటిస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి అవైటెడ్ పోస్టర్ కూడా మేకర్స్ విడుదల చెయ్యడానికి రెడీ చేసారు.

అయితే ఈ చిత్రమే అనుకుంటే తారక్ ఇటీవలే క్లారిటీ ఇచ్చిన మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ తో సినిమా పై కూడా బ్లాస్టింగ్ అప్డేట్ రానుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది కానీ ఏఈ అప్డేట్ కూడా కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఈ భారీ కాంబినేషన్ కోసం మాస్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ న్యూక్లియర్ అప్డేట్ ఏ సమయానికి బ్లాస్ట్ కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :