దర్బార్ లోకి మరో బాలీవుడ్ యాక్టర్ !

Published on Apr 28, 2019 9:19 am IST

పేట తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈచిత్రం యొక్క షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ యాక్టర్ జతిన్ సర్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. జతిన్ ,స్కెరెడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ తో పాపులర్ అయ్యాడు. ఆతరువాత అక్షయ్ కుమార్ గోల్డ్ లో కూడా నటించాడు.

ఇక దర్బార్ లో వీరితోపాటు యంగ్ హీరోయిన్ నివేతా థామస్, యోగిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :