చరణ్, లోకేష్ కాంబోపై మరో బజ్..!

Published on Jun 11, 2021 9:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ కోసం ప్రస్తుతం వినిపిస్తున్న బజ్ చూస్తుంటే ఈ మిస్టర్ బాక్సాఫీస్ మరింత స్ట్రాంగ్ అవ్వడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. అయితే వాటిలో అధికారిక ప్రకటన లేక ఇంకా క్లారిటీ లేనివి కొన్ని ఉన్నాయి. మరి అలా హైలైట్ అయిన కాంబోస్ లో మరో కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో వినిపిస్తున్న ప్రాజెక్ట్ ఒకటి.

అయితే ఈ గత కొన్ని రోజులుగా బజ్ వినిపిస్తున్న ఈ కాంబోపై మరో టాక్ వినిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబోని సెట్ చెయ్యడానికి టాలీవుడ్ లో ఓ బడా నిర్మాణ సంస్థ ట్రై చేస్తుందట. వారి ప్రయత్నాలు కానీ ఫలిస్తే ఈ కాంబోలో సినిమా పడడం ఖాయం అని తెలుస్తుంది. మరి ఈ సాలిడ్ కాంబోపై ఈ వార్తలు ఎంత వరకు నిజమో కాలమే డిసైడ్ చెయ్యాలి. ప్రస్తుతానికి అయితే చరణ్ “RRR” మరియు “ఆచార్య” ఫినిష్ చెయ్యాల్సి ఉండగా దాని తర్వాత శంకర్ తో సినిమా స్టార్ట్ చెయ్యాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :