“రాధే శ్యామ్” బ్యాలన్స్ షూట్ పై మరో బజ్.!

Published on Apr 25, 2021 8:03 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు ఆసక్తికర చిత్రాల్లో భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్” కూడా ఒకటి. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ అద్భుత ప్రేమ కావ్యంపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇండియన్ టైటానిక్ గా అభిమానులు పిలుచుకుంటున్న ఈ చిత్రం షూట్ అంతా కంప్లీట్ అయ్యింది అనుకుంటే మళ్ళీ కొన్ని రీషూట్స్ ఉన్నాయని స్టార్ట్ చెయ్యాల్సి వచ్చింది.

అయితే ఈ మిగిలి ఉన్న కాస్త షూట్ ను ఒక పది రోజుల్లో ఫినిష్ చేద్దామని ప్లాన్ గీసినా మళ్ళీ కోవిడ్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ షూట్ లో ప్రభాస్ మళ్ళీ పాల్గొనాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ బ్యాలన్స్ షూట్ లో ఒక్క ప్రభాస్ మీద సీన్స్ మాత్రమే కాకుండా పూజా హెగ్డేపై కూడా ఉన్నాయట. అందుకు పూజా కూడా మళ్ళీ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :