అందాల రాక్షసి, సాహసం, కేరింత, భలే మంచి రోజు వంటి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన రామకృష్ణ రంగస్థలం సినిమాకు వర్క్ చేసారు. రంగస్థలం సినిమాకు రామకృష్ణ వేసిన విలేజ్ సెట్స్ కు మంచి పేరు లభించింది. దీంతో దర్శకుడు తేజ తను చెయ్యబోయే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు చెయ్యమని అవకాశం ఇచ్చారు.
ఎన్టీఆర్ బయోపిక్ లో మరోసారి రామకృష్ణ తన ప్రతిభ చుపించబోతున్నాడు. తెలుగు వారు ఎక్కడున్నా ఈ సినిమాను ఒకసారి తప్పకుండా చూడాలి అనుకుంటారు ఎందుకంటే తెలుగు ప్రజల్లో ఒక ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ జీవితం గురించి తెలుసుకోవడానికి ఈ సినిమా చూస్తారు. ఈ సినిమాతో పాటు ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ మరో రెండు సినిమాలు చెయ్యబోతున్నాడు. వాటికి సంభందించి పూర్తి వివరాలు త్వరలో రానున్నాయి.
