పవన్ స్పర్శ కోసం ఎదురు చూస్తున్న మరో చిన్నారి.!

Published on Jul 4, 2021 1:00 pm IST

చిన్న వయసులోనే తమకే తిలియని వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు ఎందరో ఉన్నారు. చివరి ఊపిరి వరకు పోరాడుతూ వస్తున్న వారిలో ఎంతో మందికి ఎన్నో కోరికలు ఉంటాయి వాటిని నెరవేర్చేందుకే వారి సంబంధీకులు సహా ఇతరులు కూడా తమ వంతు సాయం చేస్తారు. అలా ఇది వరకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు తమ అభిమాన హీరోని ఒక్కసారి అయినా చూడాలి అనే చిరకాల కోరికతో వారిని చూసే వరకు ప్రాణాలు నిలుపుకొని మళ్ళీ బ్రతికిన వారు ఉన్నారు.

అలా ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ ను కూడా కలిసిన చిన్నారులు ఉన్నారు. గత కొన్నేళ్ల కితం శ్రీజ అనే చిన్నారి క్యాన్సర్ తో బాధ పడుతుండగా ఆమె చివరి కోరిక నిమిత్తం పవన్ వెళ్లి పరామర్శించి వారికి తన ఆర్ధిక సాయం కూడా అందించారు. అలాగే కొన్ని నెలల కితమే మరో అభిమాని భార్గవ్ అదే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా వెళ్లి కలిసి పరామర్శించి భరోసా ఇచ్చారు.

అయితే ఇప్పుడు నెల్లూరికి చెందిన యశశ్విని అనే చిన్నారి పవన్ స్పర్శ కోసం ఎదురు చూస్తుంది ఎముకల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తాను చివరి కోరికగా పవన్ కళ్యాణ్ బాబాయ్ ను ఒకసారి కలవాలి అనుకుంటున్నాని తెలిపింది. దీనితో పవన్ అభిమానులు సహా దర్శకుడు సాయి రాజేష్ తదితరులు ఈ వార్తను పవన్ వరకు వెళ్లేలా వేగంగా స్ప్రెడ్ చేయడంతో పవన్ వరకు ఈ విషయం వెళ్లినట్టు తెలుస్తుంది. అలాగే పవన్ కూడా ఈ కొన్ని రోజుల్లోనే ఆమెని తన కుటుంబాన్ని కలిసే అవకాశం ఉందని సమాచారం..

సంబంధిత సమాచారం :