వెంకటేష్ లైనప్ లో మరో క్రేజీ రీమేక్.?

Published on May 5, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరోస్ లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. ఓ పక్క డైరెక్ట్ మరియు రీమేక్ సినిమాలతో మంచి విజయాలతో దూసుకెళ్తున్న వెంకీ మామ రీసెంట్ గానే మళయాళ బ్లాక్ బస్టర్ “దృశ్యం 2” రీమేక్ షూట్ లో తన పార్ట్ ను కంప్లీట్ చేసేసుకున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం అనంతరం మరో క్రేజీ రీమేక్ లో వెంకటేష్ నటించనున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అది కూడా మళయాళ సూపర్ హిట్ చిత్రం “డ్రైవింగ్ లైసెన్స్” అన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి గత కొంత కాలంగా మన టాలీవుడ్ లో టాక్ ఉంది. కానీ ఫైనల్ గా ఈ చిత్రం వెంకీ మామ దగ్గరకు వెళ్లిందని గాసిప్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రం పై అధికారిక ప్రకటన కూడా రావచ్చని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :