ప్రభాస్ సినిమా పై మరో క్రేజీ రూమర్ ?

Published on May 10, 2021 12:02 am IST

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్ ‘లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా నటించబోతుందంటూ ఆ మధ్య ఒక రూమర్ బాగా వినిపించింది. ఇప్పుడు మళ్ళీ మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతుందట. ప్రభాస్ కి అక్క పాత్రలో రమ్యకృష్ణ నటించబోతుందని.. వీరిద్దరి కలయికలో మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే. కాగా ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ కూడా ఒకేసారి షూట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత షెడ్యూల్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాల తరువాత ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న సినిమా కూడా దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు నటిస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :