వైరల్ అవుతోన్న మరో క్రేజీ సాంగ్ !

Published on May 15, 2021 11:04 pm IST

ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను ఒక ఊపు ఊపేస్తోన్న పాట ‘ఎంజాయ్‌ ఎంజామీ’. మార్చి 7, 2021న యూట్యూబ్‌ వేదికగా విడుదలైన ఈ మ్యూజిక్‌ వీడియో ప్రెజెంట్ ట్రెండ్‌ కి తగ్గట్టు ఉండటంతో కేవలం రెండు నెలల్లోనే 200 మిలియన్‌ వ్యూస్‌ ను సొంతం చేసుకుంది. అరివు అందించిన మధురమైన సాహిత్యం, పాటను గాయని దీ(దీక్షితా వెంకటేశన్‌) ఆలపించిన విధానం ఈ పాటను మరో స్థాయిలో నిలబెట్టింది. ఇక అమిత్‌ కృష్ణన్‌ దర్శకత్వం కూడా చాల బాగుంది.

కాగా ఈ పాటను సంతోష్‌ నారాయణ్‌ నిర్మించారు. హీరో ధనుశ్‌ తో పాటు హీరోయిన్ సాయి పల్లవి, మాజీ హీరో సిద్ధార్థ్‌, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌, మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్‌ కనకరాజ్‌ ఇలా తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ ఈ పాట పై అనేక ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. పైగా సామాజిక మాధ్యమాల వేదికగా ఈ పాటకు వందలాది కవర్‌ సాంగ్స్‌ వచ్చాయి.

సంబంధిత సమాచారం :