గంగూలీ బయోపిక్ కన్ఫర్మ్…హీరోగా అతనేనా?

Published on Jul 13, 2021 10:50 pm IST

టీమ్ ఇండియా క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ ఇతర ఆటగాళ్ళ పై చాలా ప్రభావం చూపించారు. అయితే ఎంతో మంది యువ ఆటగాళ్లకు గంగూలీ స్ఫూర్తి. అయితే ప్రస్తుతం సౌరవ్ గంగూలీ బీసీసీఐ కి అధ్యక్షుడు గా వ్యవహరిస్తున్నారు. అయితే సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ను తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే బాలీవుడ్ లో ఇప్పటికే సంజయ్ దత్ బయోపిక్ లో నటించి ప్రశంసలు పొందిన రణ్ బీర్ కపూర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ లో నటించేందుకు సంప్రదించినట్లు సమాచారం. అయితే కథ నచ్చెయ్యడం తో రన్బీర్ కపూర్ ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గతం లో సచిన్ టెండూల్కర్ మరియు ధోనీ ల కి సంబంధించిన బయోపిక్ లు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

సంబంధిత సమాచారం :