షారుఖ్-ఆలియా మధ్య మరో ఢీల్ కుదిరిందిగా..!

Published on Jul 4, 2021 3:00 am IST


బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ ‘డార్లింగ్స్‌’ సినిమా ద్వారా నిర్మాతగా మారుతున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణ సంస్థ ఎటర్‌నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై షారూఖ్‌ ఖాన్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలియా మెయిన్ లీడ్ కాగా షెఫాలీ షా, రోషన్‌ మ్యాథ్యూ, విజయ్‌ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నేడు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది. అయితే తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో కొంచెం నెర్వస్‌గా ఫీల్ అయినట్టు ఆలియా ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది.

నిర్మాతగా ఇది నా తొలి సినిమా అయినప్పటికి నేనెప్పుడూ ముందు నటి అనే చెబుతా.. ఎప్పటికీ నటిగానే ఉంటానని అదేమిటో తెలియదు ఈ సినిమా విషయంలో నటిగా నెర్వస్‌కు లోనవుతున్నా, రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నానని అన్నారు. కొత్త సినిమా ప్రారంభించే ముందు నెర్వస్ ఫీలవుతానని, డైలాగ్స్ ఎలా చెబుతానోనన్న భయం ఉంటుందని, సెట్‌కు ఆలస్యంగా వెళతానేమోననే భయంతో 15 నిమిషాలు ముందుగానే షూటింగ్‌ లొకేషన్‌కు చేరుకుంటానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఫీలింగ్‌ ఎప్పటికీ పోదేమో అనుకుంటానని, నేను అలా ఉండకూడదు.. కానీ భయం మనలో ఉందంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నామని అర్ధమంటూ ఆలియా ట్వీట్ చేశారు.

అయితే ఆలియా చేసిన ట్వీట్‌పై షారుఖ్ ఖాన్ స్పందిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత నువ్వు చేసే మరో ప్రాజెక్ట్‌కు నన్ను కూడా కలుపుకో అంటూ, నేను చాలా ప్రోఫెషనల్‌గా ఉంటానని, షూట్‌కి ఇన్‌టైంలో వస్తానని ట్వీట్ చేయగా దీనికి ఆలియా స్పందిస్తూ మీరు నా ఫేవరెట్ ఇంతకన్నా ఎక్కువ నేను అడగలేను, ఢీల్ ఒకే అంటూ బదులిచ్చింది. దీనిని బట్టి చూస్తుంటే వీరిద్ధరి మధ్య మరో సినిమా నిర్మాణం జరిగే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చెమో అన్న ఊహాగానం తెరపైకి వచ్చింది.

సంబంధిత సమాచారం :