వాళ్ళు కొవిడ్‌ ని తక్కువగా అంచనా వేశారు !

Published on May 17, 2021 1:05 pm IST

హీరో నిఖిల్ సామాజిక అంశాల పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాడు. కాగా తాజాగా తన ఇన్‌ స్టా లైవ్‌ లో నెటిజన్లతో ముచ్చటిస్తూ ప్రస్తుత పలు విషయాలపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. నిఖిల్ మాటల్లో ‘‘తెలంగాణలో లాక్‌డౌన్‌ పెట్టకముందు హైదరాబాద్‌ రెస్టారెంట్ల బయట చాలామంది మాస్కులు లేకుండా పార్టీలు చేసుకున్నారనేది వాస్తవం. వాళ్లని చూసి నేను ఎంతో షాక్‌ అయ్యాను. ఇప్పుడు వాళ్లకి కొవిడ్‌ వచ్చి ఆసుపత్రులకు వెళ్లిన తర్వాత బెడ్స్‌, ఆక్సిజన్‌, ఇంజక్షన్లు కావాలని ఫోన్లు చేస్తున్నారు.

ప్రభుత్వమే కాదు.. ప్రజలు కూడా కొవిడ్‌ని చాలా తక్కువగా అంచనా వేశారు’’ అని నిఖిల్‌ చెప్పుకొచ్చాడు. ఇక నిఖిల్ ఆ మధ్య ఒక వీడియోను రిలీజ్ ప్రభుత్వం పై ఆవేదన వ్యక్తం చేస్తూ.. కరోనా కారణంగా బయట పరిస్థితులు ఎంతో క్లిష్టంగా మారినా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని, ఆక్సిజన్‌ అందక ఎంతో మంది కళ్ల ఎదుటే చనిపోతున్నారని అని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. అందరూ ఇళ్లలోనే ఉండాలని, కుదిరితే ఎదుటివారికి సాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు నిఖిల్ ఆ వీడియోలో కోరారు.

సంబంధిత సమాచారం :