మరో ఫాస్టెస్ట్ సోషల్ మీడియా రికార్డ్ ప్రభాస్ కంట్రోల్ లో.!

Published on Jan 26, 2021 1:01 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ ఏ స్థాయిలోనిదో అందరికీ తెలుసు. ఇప్పుడు అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం పాన్ ఇండియన్ వైడ్ కూడా భారీ ఫాలోయింగ్ ను ప్రభాస్ సొంతం చేస్కున్నాడు. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రభాస్ కు ఇప్పుడు క్రేజ్ ఏర్పడింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ కు భారీ క్రేజ్ ఉంది.

అదే ఇప్పుడు ప్రభాస్ కు మరో ఫాస్టెస్ట్ రికార్డ్ అందించింది అని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ మధ్యనే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరవడంతోనే భారీ ఎత్తున ఫాలోవర్స్ ను రాబట్టి సెన్సేషన్ ను నమోదు చేసాడు. మరి ఇప్పుడు ఇదే ఇన్స్టాగ్రామ్ లో ఫాస్టెస్ట్ 6 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించిన ఇండియన్ హీరోగా మరో రికార్డు సృష్టించాడు.

ఆ మధ్య పేస్ బుక్ లో ఫాస్టెస్ట్ 20 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించిన హీరోగా రికార్డు సెట్ చేసిన డార్లింగ్ ఇప్పుడు ఇన్స్టా లో మరో రికార్డు సెట్ చేసాడు. అది కూడా అతి తక్కువ పోస్ట్ లతో ఈ ఫీట్ ను అందుకోడం విశేషం. మరి ప్రస్తుతం ప్రభాస్ అనేక భారీ పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :