మరో ఫన్ ఎంటర్టైనర్ ప్రారంభం !
Published on Mar 4, 2018 5:15 pm IST

అల్లరి నరేష్ ప్రస్తుతం బిమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సునీల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నాడు. చిత్ర శుక్ల ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శ్రీ వసంత్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. జూన్ లో ఈ సినిమాను విడుదల చెయ్యబోతున్నారు.

ఈ సినిమా తరువాత నరేష్ నటించబోయే మరో సినిమా ఈరోజు ఉదయం ప్రారంభం అయ్యింది. నందిని నర్సింగ్ హోం సినిమాకు దర్శకత్వం వహించిన గిరి ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. ఈ చిత్రంలో నటించే నటినటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. డైరెక్టర్ సత్తిబాబుతో నరేష్ ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

 
Like us on Facebook