ప్రభాస్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ అంటూ నయా గాసిప్.!

Published on May 8, 2021 4:13 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలు ఇప్పుడు చాలానే ఉన్నాయి. దర్శకుడు రాధా కృష్ణతో ప్లాన్ చేసిన “రాధే శ్యామ్” నుంచి ఒకదాన్ని మించిన ఒకటి సాలిడ్ ప్రాజెక్ట్ ను లైనప్ లో పెట్టుకుంటూ వెళ్లిపోతున్నా ప్రభాస్ నుంచి మరో కన్ఫర్మ్ కానీ కాంబో ఒకటి రేస్ లోకి వచ్చింది.

దర్శకుడు నాగ్ అశ్విన్ తో వరకు కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్స్ ఇపుడు లిస్ట్ లో ఉండగా దాని తర్వాత బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో అన్ ఆఫీషియల్ గా ఒకటి. మరి ఈ అన్ అఫీషియల్ లిస్ట్ లోకే మరో టాలెంటెడ్ డైరెక్టర్ వచ్చినట్టుగా గాసిప్స్ మొదలయ్యాయి.

వాటి ప్రకారం కోలీవుడ్ టాలెంట్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర పేరు వినిపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిజంగానే వస్తుందో లేదో కానీ ఆల్రెడీ లైన్ ప్రభాస్ కు ఆమె వినిపించింది అని గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి మాత్రం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్స్ వరకు మాత్రమే ప్రభాస్ లైనప్ పై అధికారిక క్లారిటీ ఉంది.

సంబంధిత సమాచారం :