ప్రభాస్ “సలార్” పై మరో నయా గాసిప్.!

Published on May 21, 2021 4:04 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమయం కుదిరాక హైదరాబాద్ లోనే రెండో షెడ్యూల్ ప్రారంభించుకోనుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన క్యాస్టింగ్ లో ప్రముఖ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటించనున్నట్టుగా టాక్ వచ్చింది. మరి ఇప్పుడు ఆ పాత్రకో లేక మరో రోల్ కో ఏమో కానీ కోలీవుడ్ నటి జ్యోతిక పేరు బయటకి వచ్చింది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ప్రస్తుతానికి టాక్ నడుస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలే వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :