నాని ‘శ్యామ్ సింగ రాయ్’లో మరో హీరోయిన్ ?

Published on Dec 1, 2020 12:00 am IST

నేచ్యురల్ స్టార్ నాని ఇన్నాళ్లు ఎక్కువుగా చిన్న స్పాన్ ఉన్న సినిమాలను, సాదాసీదా నేపథ్యమున్న కథలను చూజ్ చేసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇక నుండి నాని చేయబోయే కథలకు పెద్ద సస్పాన్ ఉండాలని ఆశపడుతున్నారట. అలా ఆలోచించే ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది కలకత్తా నేపథ్యంలో జరిగే కథ అట. ‘టాక్సీవాలా’ చిత్రంతో దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.

ఇందులో నాని మెచ్యూర్ రోల్ చేయబోతున్నారు. కథ పెద్దది కావడం వలన సబ్ ప్లాట్స్ ఎక్కువగా ఉంటాయట. అందుకే కథానాయికలు కూడ ఎక్కువమంది ఉన్నారు ఇందులో. మొదట ఇద్దరు హీరోయిన్ల పేర్లను అనౌన్స్ చేశారు. వారే సాయి పల్లవి, కృతి శెట్టి. వీరిద్దరూ కాకుండా ఇంకొక హీరోయిన్ కోసం కూడా చూస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ పాత్ర కోసం నివేత పేతురాజ్, అదితిరావ్ హైదరి, నివేతా థామస్ లాంటి హీరోయిన్ల పేర్లు వినబడుతున్నాయి. మరి చూడాలి ఎవర్ని తీసుకుంటారో.

సంబంధిత సమాచారం :

More