మన తెలుగు సినిమా దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి అనేకమంది హీరోల జాబితాలో ఆయా హీరోల బాక్సాఫీస్ స్టార్డం, వసూళ్లు, హిట్స్ తో కొన్ని టైర్స్ అంటూ ఒకో విభాగంలో కొందరు హీరోల పేర్లు చేర్చుకున్నారు. ఇలా టైర్ 1, 2 లలో మన సీనియర్ స్టార్స్ అలాగే యంగ్ హీరోలు కొందరు కనిపిస్తారు.
అయితే టైర్ 2 లిస్ట్ లో ఉన్నటువంటి కొందరు యంగ్ హీరోస్ లో సినిమా సినిమాకి తమ మార్కెట్ పెంచుకుంటూ టైర్ 1 లోకి అడుగు పెడుతున్నారు. అయితే వీరిలో మొదటిగా మాత్రం నాచురల్ స్టార్ నాని అఫీషియల్ గా తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడని చెప్పవచ్చు. చాలామంది ఇప్పుడు తాను చేస్తున్న భారీ చిత్రం ది ప్యారడైజ్ తోనే ఇది సాధ్యం అవుతుంది అని భావించారు.
దీనికి ముందు వచ్చిన హిట్ 3 ఓపెనింగ్స్ కూడా భారీ లెవెల్లో వచ్చాయి. ఇక నిన్న వచ్చిన ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ దెబ్బకి నాని మొత్తం సమీకరణాలు మార్చేసుకున్నాడు. ఈ చిత్రంలో డెఫినెట్ గా అతడు టైర్ 1 లిస్ట్ లోకి వెళ్ళిపోతాడు అనే భావన చాలా మందిలో మొదలైంది. దీనితో ఫ్యాన్స్ కి మాత్రం ఇది మంచి కిక్ ఇచ్చే అంశమే అని చెప్పొచ్చు.


