అవైటెడ్ “గ్రే మాన్” కోసం మరో ప్రముఖ ఇండియన్ నటుడు.!

అవైటెడ్ “గ్రే మాన్” కోసం మరో ప్రముఖ ఇండియన్ నటుడు.!

Published on Jul 16, 2022 7:09 PM IST


హాలీవుడ్ ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్, రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో నెట్‌ఫ్లిక్స్‌ కోసం తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ‘గ్రే మాన్ టీమ్ తో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ఒక సీక్రెట్ మిషన్ లో ఉన్నారు అందులో వాళ్లకి మీ సహాయం కావాలి’ అంటూ ఆ వీడియో లో ఉన్న ఒక సీక్రెట్ కోడ్ ని చెప్పి ‘గ్రే మాన్’ ఇండియన్ ప్రీమియర్ టికెట్స్ గెలుచుకునే అవకాశం ఇచ్చారు.

ముంబై లో జులై 20 న జరిగే ఈ ప్రీమియర్ లో మూవీ డైరెక్టర్స్ తో పాటు ధనుష్ ఇతర తారాగణం హాజరు కానున్నారు. ఈ చిత్రం జూలై 22న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. మార్క్ గ్రీన్ రాసిన ‘ది గ్రే మ్యాన్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో రూసో బ్రదర్స్ ఈ సినిమాను రూపొందించారు. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ జూలై 22న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు