“ఆచార్య” పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Apr 17, 2021 4:00 pm IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. అలాగే చిరుతో పాటుగా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే లు మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరి ఇప్పుడు శరవేగంగా షూటింగ్ కొనసాగుతున్న ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న సోనూ సూద్ కోవిడ్ పాజిటివ్ రావడం కలకలం రేపింది. అయితే మరోపక్క ఈ చిత్రానికి సంబంధించి కాస్త ఇంట్రెస్టింగ్ ఇన్ఫో కూడా బయటకు వస్తుంది. ఈ చిత్రంలో చిరు మరియు చరణ్ లు నక్సల్స్ గా కనిపిస్తారన్న సంగతి తెలిసిందే.

మరి చరణ్ కు ప్రేయసి గా కనిపించే పూజా హెగ్డే పాత్ర నీలాంబరి చరణ్ రోల్ సిద్ధ కు మధ్య వారధిగా ఉంటుందట అంటే తనకి సాయం చేసే రోల్ లో అన్నట్టు. దీనిని బట్టి కొరటాల కాస్త చిన్నదే అయినా చరణ్ మరియు పూజాలకు సాలిడ్ రోల్స్ నే ఇచ్చినట్టు ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :