“ఆదిపురుష్” పై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on May 15, 2021 10:28 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస కావ్యం “ఆదిపురుష్” లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా కృతి సీత పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

ఆల్రెడీ ఈ చిత్రంలో పలు ముఖ్య పాత్రలకు స్టార్ నటులను లైన్ లో పెడుతున్న ఓంరౌత్ మేఘనాథుని పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లాను అనుకుంటున్నారని టాక్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ దీనికి మంచి పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. మరి వేచి చూడాలి ఏం జరుగుతుందో అన్నది.

సంబంధిత సమాచారం :