మహేష్ నెక్స్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on May 21, 2021 12:07 pm IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్లతో ఆల్రెడీ “సర్కారు వారి పాట” అనే మాస్ చిత్రం లైన్ లో ఉంది. మరి దీని తర్వాత మహేష్ తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ముచ్చటగా మూడో సినిమా మొదలు పెట్టేసరికి దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి దీనిపైనే గత కొన్నాళ్ల నుంచి పలు ఆసక్తికర టాక్స్ వినిపిస్తున్నాయి.

అధికారికంగా కన్ఫర్మ్ కాబడిన ఈ కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. వచ్చే మే 31 న సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈ హ్యాట్రిక్ కాంబో చిత్రం నుంచి కూడా ఊహించదగ్గ పెద్ద అప్డేట్ నే వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి గతంలో సర్కారు వారి పాటకు ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసినట్టుగా దీనికి కూడా ఏమన్నా అలా ప్లాన్ చేశారేమో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :