హరీష్ చిత్రంలో పవన్ రోల్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on May 20, 2021 4:04 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ ఏడాదిలోనే తన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” తో అలరించారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా లైన్ లో ఉండగానే ఎప్పుడు లేని విధంగా అనేక చిత్రాలను ఓకే చేసి ఆశ్చర్యపరిచారు. మరి ఈ సాలిడ్ లైనప్ లో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో రెండో చిత్రం అందులోని డైరెక్ట్ చిత్రం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై డిజైన్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే వాటిని బట్టి ఈ చిత్రంలో పవన్ రోల్ మాంచి ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నట్టుగా అర్ధం అయ్యింది. కానీ లేటెస్ట్ గా మాత్రం ఈ చిత్రంలో ఒక భారీ కాలేజ్ సెటప్ కోసం చర్చ బయటకి వచ్చింది.

దీనితో పవన్ కానీ ఇందులో ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నారా అన్న టాక్ స్టార్ట్ అయ్యింది. ఇది వినడానికి కాస్త బాగానే ఉన్నా తన రోల్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీనే అని చెప్పాలి. మరి హరీష్ ఈసారి పవన్ ను ఎలా ప్రెజెంట్ చేయనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :