“సలార్” పై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on May 14, 2021 9:25 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ సహా పాన్ ఇండియన్ వైడ్ మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలో ఈ చిత్రంపై అనేక రకాల రూమర్స్ కూడా బయటకు వచ్చాయి.

అసలు ఈ చిత్రం స్ట్రైట్ సినిమానా లేక రీమేక్ సినిమా అన్న అంశం నుంచి ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న రోల్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ గాసిప్పులే వినిపిస్తున్నాయి. అలా ప్రభాస్ ఈ చిత్రం డ్యూయల్ రోల్స్ లో డ్యూయల్ షేడ్స్ తో కనిపిస్తాడని విన్నాం. కానీ ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రభాస్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడట.

మరి దీనిలో ఎంత వరకు నిజముందో కానీ టాక్ అయితే వైరల్ అవుతుంది. అయితే ఆల్రెడీ రెండు లుక్స్ కన్ఫర్మ్ అయ్యిపోయాయి మరి మూడోది ఉందో లేదో కాలమే నిర్ణయించాలి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కేజీయఫ్ నిర్మాణ సంస్థ హోంబలే పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :