సూర్య, బోయపాటి మాస్ కాంబోపై మరో ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jun 23, 2021 7:12 pm IST

అటు తమిళ్ మరియు మన తెలుగు మార్కెట్ లో కూడా మంచి ఆదరణ ఉన్న అతి తక్కువ మంది కోలీవుడ్ స్టార్ హీరోల్లో సూర్య కూడా ఒకరు. మరి సూర్య ప్రస్తుతం రెండు తమిళ్ సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత నేరుగా ఓ స్ట్రైట్ సినిమాతో సూర్య పలకరించనున్నాడని ఇటీవల కూడా తెలిసింది.

అది కూడా మాస్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు బోయపాటి కాంబోలో అని బజ్ రాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వినిపిస్తుంది. ఈ చిత్రం ఉంటే దాదాపు రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుందట. తెలుగు మరియు తమిళ్ లో ఒకేసారి బై లాంగువల్ సినిమాగా ప్లాన్ చేయనున్నట్టు నయా టాక్.

మరి ఈ సాలిడ్ కాంబో ఎప్పటి నుంచి స్టార్ట్ కానుందో చూడాలి. ఇక అలాగే ఈ చిత్రాన్ని కూడా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజునే నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :