“పుష్ప” పై మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్.!

Published on May 21, 2021 5:00 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. ఈ చిత్రం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక్కో డెవలెప్మెంట్ తో ఊహించని రేంజ్ కి ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ సెట్ చేసి పెట్టారు. అలాగే క్యాస్టింగ్ పరంగా కూడా ఎక్కడా తగ్గని సుకుమార్ తన లాస్ట్ చిత్రం “రంగస్థలం” చిత్రం లో ఒక కీలక పాత్ర ఇచ్చిన గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కి ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారని తెలిసింది.

అయితే మొదటగా ఈమె రోల్ ఒక్క పార్ట్ 1 లోనే ఉంటుందా లేక రెండు సినిమాల్లోని ఉంటుందా అన్న చర్చలు అయితే రాలేదు. కానీ ఇప్పుడు సినిమాను మరింత ఎక్స్ పాండ్ చేసే సరికి ఆమె రోల్ కూడా ఇంకా ఎక్కువ పెరిగింది అని అంటే రెండు భాగాల్లో కూడా అనసూయ కనిపించే అవకాశం ఉందని తాజా గాసిప్ వినిపిస్తుంది. మరి దీనిలో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :