పవన్ క్రేజీ ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ గాసిప్.!

Published on Dec 3, 2020 5:00 pm IST

ఎప్పుడు లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకదాన్ని మించి ఒక వరుస సినిమాలను ఓకే చేసుకుంటూ వెళ్లిపోయారు. అయితే ఇటీవలే పవన్ మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన తెలిసిందే. వాటిలో ఒకటి అయ్యప్పణం కోషియం రీమేక్ కన్ఫర్మ్ కాగా మరొకటి తన అభిమాని అలాగే మన దక్షిణాదిలో ఒక టాప్ మోస్ట్ డాన్స్ కొరియోయోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ తో ఒక సినిమాను ఓకే చేశారన్న వార్త సినీ వర్గాల్లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

దీనితో ఈ ప్రాజెక్ట్ కూడా పవన్ అభిమానుల్లో మంచి క్రేజీ సినిమాగా మారింది. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తుంది. అదే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణం వహిస్తాడు అని. తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని చరణ్ టేకప్ చేస్తాడు అని గాసిప్స్ మొదలయ్యిపోయాయి. మరి ఆసక్తికర ప్రాజెక్ట్ అసలు ఉందో లేదో కూడా కన్ఫర్మ్ కాలేదు. దీనిపై మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.

సంబంధిత సమాచారం :