మహేష్ – త్రివి ప్రాజెక్ట్ హీరోయిన్ పై మళ్ళీ ఇంట్రెస్టింగ్ గాసిప్స్.!

Published on Jun 8, 2022 4:00 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా లేటెస్ట్ గా చేసిన భారీ బ్లాక్ బస్టర్ చిత్రం “సర్కారు వారి పాట”. మహేష్ కెరీర్ లో వరుస హిట్స్ తర్వాత మరో హ్యాట్రిక్ కి నాంది అన్నట్టు దర్శకుడు పరశురామ్ పెట్ల తో అనౌన్స్ చేసిన ఈ సినిమా జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ తోనే ఎనలేని హైప్ ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ తన కెరీర్ లో హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా చేసేందుకు మహేష్ ఓకే చెప్పాడు.

మరి ఈ సినిమా త్రివిక్రమ్ కెరీర్ లోనే ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తుండగా గత కొన్ని రోజులు నుంచి అయితే ఈ సినిమా హీరోయిన్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే మొదట పూజా హెగ్డే ఫిక్స్ అయ్యిందని తెలిసినా తర్వాత ఆమె తప్పుకుందని యంగ్ హీరోయిన్ రేస్ లోకి వచ్చిందని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మళ్ళీ రష్మికా మందన్నా పేరు రేస్ లోకి వచ్చినట్టు కూడా వినికిడి. మరి వీటిలో ఏ పేరు ఫిక్స్ అవుతుందో అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :