“అఖండ” పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Jul 28, 2021 12:50 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన హ్యాట్రిక్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” అనే భారీ మాస్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు సాలిడ్ మాస్ క్లైమాక్స్ ని తమిళనాడులో ఈ చిత్రం షూట్ చేసుకుంటుంది. అయితే ఈ చిత్రంలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తుండగా అఘోర పాత్ర కూడా ఒకటి. అయితే ఇదే అఘోరా గా ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు కనిపించనున్నారని తెలుస్తుంది.

అంతే కాకుండా బాలయ్య కథకు కూడా జగపతి బాబు రోల్ కీలక మార్గదర్శకంగా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలయ్యతో పాటుగా ఇతర కీలక పాత్రలు కూడా స్టన్నింగ్ అవతార్ లో ఉండనున్నట్టు టాక్ ఉంది. మరి ఆ లెక్కన జగపతి బాబు కూడా అలా కనిపిస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రంలో జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ హంగులతో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :