‘ఎన్టీఆర్ 30’ లో జాన్వీ కపూర్ పాత్ర అదే ?

‘ఎన్టీఆర్ 30’ లో జాన్వీ కపూర్ పాత్ర అదే ?

Published on May 22, 2023 8:00 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అయితే జాన్వీ కపూర్ పాత్ర పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. సినిమాలో ఆమె ఓ మత్స్యకారుని కూతురిగా కనిపిస్తోందని.. జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగాఓణిలో అలాగే పల్చని చీరలో ఆమె ఎక్కువగా కనిపిస్తోంది అని టాక్ నడుస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఆ మధ్య మేకర్స్ రిలీజ్ చేసిన జాన్వీ లుక్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో మరో హీరయిన్ పాత్ర కూడా ఉందని.. ఆ పాత్ర కోసం మరో భామను ఫైనల్ చేసే పనిలో కొరటాల ఉన్నాడట.

కాగా ఈ సినిమా షూట్ వేగంగా జరుగుతుంది. ఇక కథలో అయితే కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు