“సర్కారు వారి పాట” ప్లాన్ లో మరో కీలక చేంజ్.?

Published on Jan 15, 2021 8:00 am IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. వరుస విజయ చిత్రాల దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ సాలిడ్ ఎంటెర్టైనర్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ టీజర్ లకు రెస్పాన్స్ ను అందుకున్న ఈ చిత్రం షూట్ పరంగా కూడా పలు ఆసక్తికర మార్పులే ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నాయి. మరి అలా మొదట చిత్ర యూనిట్ యూఎస్ లో ప్లాన్ చేసిన షెడ్యూల్ కాస్తా మారి హైదరాబాద్ కు మారింది.

మరి ఈ జనవరి చివరి వారంలో ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ కూడా ఇప్పుడు మారినట్టు తెలుస్తుంది. మేకర్స్ మొదటగా దుబాయ్ లోని ఒక కీలక షెడ్యూల్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.

దాని తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ కు రానున్నారట. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మహేష్ బాబులు కలిసి సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :