“సలార్” నుంచి మరో లీక్ వచ్చిందా.?

Published on Jul 2, 2021 10:01 am IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న సాలిడ్ పాన్ ఇండియన్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శత్వంలో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. భారీ అంచనాలను సెట్ చేసుకున్న ఈ చిత్రం ఆల్రెడీ ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది.

ఇక ఇదిలా ఉండగా రెండో షెడ్యూల్ కూడా ఇంకొన్ని వారాల్లో మొదలు కానుండగా ఈ చిత్రంపై మరో లీక్ వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ లోనే ఓ మేకింగ్ వీడియో బయటకి రాగా ఇప్పుడు కూడా మరో క్రేజీ సీక్వెన్స్ పై వచ్చినట్టు తెలుస్తుంది.

ఫస్ట్ లుక్ లో చూపిన డ్రెస్సింగ్ లోనే ఓ బైక్ మీద ప్రభాస్ కనిపిస్తున్న ఫోటోలు మరియు వీడియో సోషల్ మీడియాలోనే వైరల్ అవుతున్నాయి. పైగా ఎగ్జైట్మెంట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు. మరి మేకర్స్ ఈ లీక్స్ పై మరింత జాగ్రత్త వహిస్తే బెటర్.. ఇక ఈ చిత్రానికి కేజీయఫ్ టెక్నికల్ టీం నే పని చేస్తుండగా హోంబలే నిర్మాణ సంస్థ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :