“సలార్” లో ప్రభాస్ రోల్ పై మరో మాస్ బజ్.!

Published on May 18, 2021 9:14 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పలు భారీ చిత్రాల్లో సెన్సేషనల్ దర్సకుడి ప్రశాంత్ నీల్ తో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై గత కొన్నాళ్ల నుంచి హాట్ బజ్ వినిపిస్తుంది. మరి దాని ప్రకారం ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని టాక్ రాగా వాటిలో ఒక రోల్ పై ఇంకో ఆసక్తికర బజ్ కొంత కాలం నుంచి వినిపిస్తుంది.

ఈ చిత్రంలో ఓ ప్రభాస్ ఆర్మీ మేజర్ గా కనిపిస్తాడని తెలిసింది. మరి దీనిపై కన్నడ వర్గాలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నాయి. మరి ఈ మాస్ బజ్ లో ఎంత వరకు నిజముందో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందిస్తుండగా కేజీయఫ్ నిర్మాణ సంస్థే హోంబలే ప్రొడక్షన్స్ వారే నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :