‘ఆచార్య’లో మెగా ఫ్యామిలీ నుండి మరొకరు !

‘ఆచార్య’లో మెగా ఫ్యామిలీ నుండి మరొకరు !

Published on Apr 9, 2020 1:30 AM IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరొకరు కూడా ఆచార్యలో నటించబోతున్నారు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మెగా వారసురాలు నీహారిక కొణిదెల కూడా ఓ ప్రత్యేక అతిధి పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతుంది. లాక్ డౌన్ ముగిసిన తరువాత మొదలయ్యే షూట్ లో నిహారిక పాల్గొననుంది. అయితే, మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. చరణ్ రోల్ సినిమాలో దాదాపు ఇరవై నిముషాల పాటు సినిమాలో కనిపిస్తారని.. అందులో పదిహేను నిముషాల పాటు మెగాస్టార్ తో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని సమాచారం.

కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు