మెగా ఫ్యామిలీలో మరో హీరోకి కరోనా పాజిటివ్.!

Published on Apr 22, 2021 2:00 pm IST

ఇప్పుడు మళ్ళీ కరోనా ప్రభావం ఏ స్థాయిలో పెరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాము. అలా మన టాలీవుడ్ లో కూడా పలువురు స్టార్ నటులు కరోనా బారిన పడడం కలకలం రేపింది. మరి ఇదిలా ఉండగా రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడడం మెగా ఫ్యాన్స్ కలవర పెట్టింది.

దాదాపు మెగా కుటుంబంలో ఒకరు ఇద్దరు మినహా అందరికీ సోకిన కరోనా ఇప్పుడు మరో నటుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్. విజేత సినిమాతో తెలుగులో హీరోగా పరిచయం కాబడిన కళ్యాణ్ ఇప్పుడు కరోనా బారిన పడినట్టుగా తెలిపాడు.

కొన్ని కోవిడ్ లక్షణాలు ఉండడంతో నిన్న కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది అని ప్రస్తుతం ఆసుపత్రిలో క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపాడు. మరి కళ్యాణ్ కూడా త్వరగా కోలుకొని తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ రెండు సినిమాలు చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :