మరో బయోపిక్ తో రాబోతున్న నందమూరి హీరో..ఈసారి ఏమవుతుందో.?

Published on Apr 26, 2019 12:23 pm IST

టాలీవుడ్ లో బయోపిక్ సినిమాల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన సినిమా “యన్.టి.ఆర్”. స్వర్గీయ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రపై రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అయితే అందుకోలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఒక సరికొత్త బయోపిక్ కు శ్రీకారం చుట్టారు.

అతనే నందమూరి తారక రత్న. తన సినిమా కెరీర్ ఆరంభంలో పర్వాలేదనిపించినా ఆ తర్వాత నుంచి చెప్పుకోదగ్గ విజయం అయితే తారక రత్నకు దక్కలేదు. ఇతర సినిమాల్లో కొన్ని కొన్ని పాత్రలు నెగిటివ్ రోల్స్ లో కూడా తారక రత్న కనిపించారు. ఈ సమయంలో విజయవాడకు చెందిన రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రు జీవిత చరిత్రపై ఒక సినిమా తీయబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే వీరి కుటుంబం నుంచి వచ్చిన బయోపిక్ ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. మరి తారక రత్న అయినా సరే మంచి విజయాన్ని అందుకొని తన కెరీర్ లో హిట్ ను నమోదు చేసుకుంటాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :