టాక్..”RRR” నుంచి ఇంకో పవర్ఫుల్ పోస్టర్ రాబోతోందా.?

Published on Dec 7, 2021 9:00 am IST

తన సినిమాని ఆడియెన్స్ లోకి ఎలా తీసుకెళ్ళాలో దర్శకుడు రాజమౌళి కి బాగా తెలుసు. మరి ఇప్పుడు అలానే తన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ని తీసుకెళ్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కి ముందే ఒక్కో ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో ప్రతీ ఒకరి అటెన్షన్ ని జక్కన్న పట్ట్టేసాడు.

మరి నిన్న ఇద్దరు హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన భీమ్ పోస్టర్ అలాగే రామ్ చరణ్ చేసిన అల్లూరి పోస్టర్స్ కి గాను భారీ రెస్పాన్స్ అందుకోగా ఈరోజు ఇంకో సాలిడ్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ముందు ఇద్దరివీ వేరే వేరేగా రిలీజ్ చెయ్యగా ఇప్పుడు ఇద్దరివీ కలిపి ఒక మాసివ్ పవర్ఫుల్ పోస్టర్ ని డిజైన్ చేసింది రిలీజ్ చేస్తారట.

ఇక ఈ పోస్టర్ ఎలా ఉంటుందో, ఇద్దరి హీరోస్ లుక్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో అజయ్ దేవగన్, ఆలియా భట్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే డీవీవీ దానయ్య నిర్మాణం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :