“గాడ్ ఫాథర్”లో సల్మాన్ ఎంపికపై మరో కారణం..!

Published on Oct 2, 2022 10:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాథర్”. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మరి తన రోల్ కి సంబంధించి అందరికీ ఒక క్లారిటీ ఉంది. అలాగే ఇంకోపక్క నిన్ననే హిందీ ట్రైలర్ లాంచ్ జరిగిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఈవెంట్ లో సల్మాన్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హిందీ సినిమాలు మీ దగ్గర సరిగ్గా రాణించట్లేదు అని కానీ తెలుగు సినిమాలో హిందీలో బాగా ఆడుతున్నాయని నవ్వుతూ అన్నారు. మరి దీనికి మెగాస్టార్ అయితే ఈ పరిస్థితి పోగొట్టాలనే సల్మాన్ భాయ్ ని తమ సినిమాలో తీసుకున్నామని రెండు ఇండస్ట్రీలలో రెండు భాషల సినిమాలకి మంచి ఆదరణ ఉండాలనే కారణం కూడా సల్మాన్ ఎంపికపై ఉందని మెగాస్టార్ అయితే మరో విషయాన్ని వెల్లడించారు.

సంబంధిత సమాచారం :